ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
కరీంనగర్: 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఉమ్మడి కరీంనగర్ (KNR) జిల్లా విద్యార్థులకు ప్రముఖ ఐటీ సంస్థ HCL టెక్నాలజీస్ మెగా జాబ్ మేళాను ఈ నెల జూలై 15న నిర్వహించనుంది. ఈ విషయాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) ఆంజనేయ వెల్లడించారు.
అర్హతలు:
- MPC, MEC విద్యార్థులు గణితంలో కనీసం 80% మార్కులు సాధించి ఉండాలి.
- CEC, BiPC, వొకేషనల్ కంప్యూటర్స్ విద్యార్థులు మొత్తం 75% మార్కులు సాధించి ఉండాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు తమ విద్యా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో మరియు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.
వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల, కరీంనగర్
తేదీ: 15 జూలై 2026
సమయం: ఉదయం 11:00 గంటలకు
అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆంజనేయ కోరారు.

Comments
Post a Comment