విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైతే ఫ్రీగా కళ్లద్దాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభం.. చూపు సమస్యలు ఉన్న విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి నుంచి విద్యార్థులకు ప్రత్యేక కంటి పరీక్షల (Eye Screening) కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో వైద్య బృందాలు విద్యార్థుల కంటి చూపును పరీక్షించి, చూపు లోపాలు ఉన్న వారిని గుర్తించనున్నాయి.
పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు తేలిన విద్యార్థులకు నిపుణుల సలహా మేరకు ఉచితంగా కళ్లద్దాలు (Free Spectacles) అందజేయనున్నారు. చిన్న వయసులోనే చూపు సమస్యలను గుర్తించి, విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని, కంటి పరీక్షల సమయంలో విద్యార్థులు సహకరించాలని అధికారులు సూచించారు. అవసరమైతే తదుపరి వైద్య చికిత్స కోసం కూడా సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేసే ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు.
కొలుకున్న గిల్.. రెండో వన్డేకు లైన్ క్లియర్!

Comments
Post a Comment